Sunday, May 28, 2017

Prashanthatha

ప్రశాంతత!
మనిషి, మనిషి సృష్టిత ప్రపంచం, రెండూ నిద్రిస్తున్నాయి
మనిషిని చేసిన ప్రపంచమే చప్పుడు చేస్తుంది

ఆకులూపుకుంటూ చెట్లు కబుర్లు చెప్పుకుంటున్నాయి
చిన్నపిల్లాడిలా గాలి ఊరంతా తిరుగుతుంది
జంతువులన్నీ మనిషి భయం లేకుండా అరుస్తున్నాయి
పాలవెన్నెల్లో చంద్రుడు స్నానం చేస్తున్నాడు
ఆకాశం చుక్కలదుప్పటిలో భూమిని కప్పేసింది

ఈ రాత్రి ఎంత బాగుంది!
ఎవరైనా ఆ సూర్యునికి చెప్పండి, కాస్త మెల్లగా రమ్మని,
మనిషిని  నిద్రలేపొద్దని!

No comments: