Thursday, March 22, 2012

Toorpu Velle Railu

జీవితం, రైలు.
రైలు, జీవితం.
చీకటిని చీల్చుకుంటూ పొగని వదులుతూ
ప్రపంచాన్ని వెనక్కి నెడుతూ కదులుతుంది ఈ రైలు.
ఈ తూరుపు వెళ్ళే రైలు.

తనకు దారి మనమే చూపినా
తనదారి తనదే అనుకుంటూ
పరిగెడుతుందీ రైలు తన గమ్యం చేరేవరకు
ఈ పట్టాల మీది రైలు.

పోటుగాడిలా వేగం వున్నా
పిల్లవాడిలా వణుకుతుందీ రైలు
ప్రపంచమంతా తిరగగలిగినా
ఇంటిగడప ముందు సిగ్గుపడుతుందీ రైలు
ఈ వంద గిల్లల రైలు.

లక్షలాదిని మోసే రైలు కోటి ఆశలకు పచ్చజెండా రైలు
నా జీవితాన్ని ఎటు తిప్పుతుందో
ఈ ప్రయాణం ఏ కలల చెంతకో
తనకు మాత్రం తెలుసా
ఈ బ్రతుకుతున్న రైలు.